పెళ్లి పేరుతో అత్యాచారం.. రూ.42 లక్షలతో పరార్

19293చూసినవారు
పెళ్లి పేరుతో అత్యాచారం.. రూ.42 లక్షలతో పరార్
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ(36)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందూర్బార్‌లో జరిగింది. భర్తతో విడిపోయి పాపతో ఒంటరిగా ఉంటున్న ఆమెకు.. తాను సివిల్ ఇంజినీర్‌నని, పెద్ద హోటల్ ఉందని, అపారమైన డబ్బు ఉందని నమ్మించాడు. ఆమె నుంచి రూ.42 లక్షలు, ఒక కారును కాజేసి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్