బాలికపై అత్యాచారం.. కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు

56చూసినవారు
బాలికపై అత్యాచారం.. కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఏపీలోని వైయస్ఆర్ కడప జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2024 ఏప్రిల్‌లో 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని దోషిగా తేల్చి, యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ నేరాన్ని 'రేరెస్ట్ ఆఫ్ రేర్'గా పేర్కొంది. అదనంగా రూ.10 వేల జరిమానా కూడా విధించింది. అదే విధంగా బాధిత బాలికకు రూ.10.50 లక్షల పరిహారం DLSA ద్వారా 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.