AP: ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రాప్తాడు బాలికకు బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతంగా జరిగినట్లు మంత్రి నారా
లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. ప్లాస్టిక్ సర్జరీ బృందం కూడా పరిస్థితిని సమీక్షించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక పీఐసీయూలో చికిత్స పొందుతోంది. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు తాము వైద్య బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, బాలిక ఆరోగ్యంపై నిఘా ఉంచామని ఆయన వెల్లడించారు.