కాక్‌టెయిల్ 2లో రష్మిక: బోల్డ్ రోల్ తో ప్రేక్షకుల ముందు

5349చూసినవారు
కాక్‌టెయిల్ 2లో రష్మిక: బోల్డ్ రోల్ తో ప్రేక్షకుల ముందు
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక మందన్న త్వరలో 'కాక్‌టెయిల్ 2' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్ లతో కలిసి నటించిన ఈ చిత్రానికి హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'కాక్‌టెయిల్'కు ఇది సీక్వెల్. ఈ చిత్రం నుంచి విడుదలైన రష్మిక పోస్టర్ వైరల్ అవుతోంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు లెస్బియన్ అంశాన్ని కూడా టచ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. జూన్ 19న విడుదల కానున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, పెళ్లి తర్వాత రష్మిక నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్