తిరుమలకు మరో అరుదైన రికార్డు

991చూసినవారు
తిరుమలకు మరో అరుదైన రికార్డు
రథసప్తమి రోజు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు ఈ వేడుకలు కొనసాగాయి. సుమారు 3.45 లక్షల మంది భక్తులు ఈ వాహన సేవలను తిలకించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాద విభాగం 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలను, 6.41 లక్షల మందికి కాఫీ, టీ, పాలు, టిఫిన్లను పంపిణీ చేసింది. ఎండ వేడిని తట్టుకునేలా దాదాపు 4 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేశారు. వేలాది మంది శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేశారు. తిరుమల చరిత్రలో అత్యంత క్రమశిక్షణతో, వైభవంగా జరిగిన రథసప్తమి వేడుకల్లో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్