భారత వెటరన్ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం కామెంటేటర్‌గా మారనున్నారు. జియోస్టార్ బ్రాడ్‌కాస్టింగ్ బృందంలో చేరిన అశ్విన్, తన విశ్లేషణాత్మక నైపుణ్యాలతో అభిమానులను అలరించనున్నారు. ఆయనతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, ఫాఫ్ డుప్లెసిస్, అనిల్ కుంబ్లే వంటి భారత, ఐపీఎల్ స్టార్లు, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, డేల్ స్టెయిన్, కెవిన్ పీటర్సన్ వంటి అనుభవజ్ఞులైన బ్రాడ్‌కాస్టర్లు కూడా ఈ బృందంలో భాగమయ్యారు.