AP: రావోక్స్ అగ్రిటెక్ అనే సంస్థ గతేడాది నవంబర్లోనే స్టార్ట్ అయిందని
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘రావోక్స్ అగ్రిటెక్ అనే సంస్థకు చిత్తూరు జిల్లాలో 40.50 ఎకరాల భూమిని ఇస్తూ కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చింది. అసలేంటి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ అని పరిశీలిస్తే.. ఆశ్చర్యపోయే విషయాలు బయటికి వచ్చాయి. ఈ కంపెనీ జస్ట్ రూ.9 లక్షలు. కానీ.. జీవోలో మాత్రం ఈ కంపెనీ రూ.1,388.14 కోట్లు పెట్టుబడులు పెడతారని ఇచ్చారు. ఇది ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించారు.