భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలక సంస్కరణలను ప్రకటించింది. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లకు గరిష్టంగా నలుగురు నామినీలను జోడించుకోవచ్చు. క్రెడిట్ స్కోర్లు ఇకపై నెలకొకసారి కాకుండా ప్రతి వారం అప్‌డేట్ అవుతాయి. ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఉన్న రుణాలపై ముందస్తు చెల్లింపు ఫోర్‌క్లోజర్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశారు. బంగారు లోహ రుణాల (GML) తిరిగి చెల్లించే గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచారు.