బంగారంపై RBI సడలింపు: రుణ పరిమితి పెంపు

4827చూసినవారు
బంగారంపై RBI సడలింపు: రుణ పరిమితి పెంపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బంగారు రుణాలపై లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిలో కీలక సడలింపులు ప్రకటించింది. రూ.2.5 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకునేవారికి బంగారం విలువలో 85 శాతం వరకు రుణం లభించనుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకునేవారికి 80 శాతం, రూ.5 లక్షలకు మించిన రుణాలకు 75 శాతం LTV కొనసాగనుంది. ఈ నిర్ణయం చిన్న, మధ్యతరహా రుణగ్రహీతలకు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు, రైతులు, అత్యవసర నగదు అవసరాలు ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్