ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ RCB, SRHపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని RCB కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 200 పైచిలుకు లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా RCB సరికొత్త రికార్డు సృష్టించింది. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (61) అద్భుత భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.