తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి, డీఎంకే నేత సంతోష్ (45) తన భార్య శరణ్య (36), 14 ఏళ్ల కుమార్తె సాత్వికను హత్య చేసిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పాఠశాల నుంచి కుమార్తెను ముందుగానే ఇంటికి తీసుకొచ్చిన సంతోష్, భార్యను గొంతునులిమి, కుమార్తెపై సుత్తితో దాడి చేసి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం హైవేపై లారీ కిందపడి మృతి చెందాడు. వ్యాపార నష్టాల కారణంగానే ఈ ఘటన జరిగిందా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.