దొంగలకు దడ పుట్టిస్తున్న రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్ (వీడియో)

3082చూసినవారు
మెక్సికోలోని జలిస్కోలో బైక్ దొంగలను పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న 'బ్యాట్‌మ్యాన్' చర్యలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనలను చట్టవిరుద్ధమైన నిర్బంధం, దాడిగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. ఈ దాడులు ఒక వ్యక్తి కాకుండా ఒక బృందం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. జూన్ 13, 17, 19 తేదీల్లో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులు స్పష్టం చేశారు. దాడులకు ఉపయోగించిన రెండు అనుమానాస్పద వాహనాలను అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్