రియల్‌మీ సంస్థ తమ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ 'పీ4 పవర్ 5జీ'ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.26 వేల నుంచి ప్రారంభమవుతుంది.