డేటా అవసరం లేని రీఛార్జ్ ప్లాన్లు.. ప్రతిపాదించిన ట్రాయ్

8960చూసినవారు
డేటా అవసరం లేని రీఛార్జ్ ప్లాన్లు.. ప్రతిపాదించిన ట్రాయ్
భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వినియోగదారులకు ఊరటనిచ్చేలా కీలక ప్రతిపాదన చేసింది. ఇంటర్నెట్ అవసరం లేని వారికి, కేవలం ఫోన్ కాల్స్, సందేశాల కోసం ప్రత్యేకమైన, తక్కువ ధర ప్లాన్లను అందుబాటులోకి తేవాలని టెలికాం కంపెనీలకు సూచించింది. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమైనా, సామాన్యులకు భారంగా మారకుండా అతి తక్కువ ధరకే ఈ సేవలు అందించాలని ట్రాయ్ భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రెండో నంబర్ నిర్వహణ, వైఫై వినియోగదారులకు మేలు జరుగుతుంది.

సంబంధిత పోస్ట్