మరింత పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు

10528చూసినవారు
మరింత పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు
రాబోయే 3-4 నెలల్లో టెలికం ఆపరేటర్లు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 15% వరకు పెంచే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్​స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మార్కెట్లో కేవలం 4 కంపెనీలు మిగలడం, 2జీ నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు మారడం, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి కారణాలతో టెలికం కంపెనీల ఆదాయం గణనీయంగా పెరగనుంది. జియో, ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుండగా.. వొడాఫోన్ ఐడియా మాత్రం తన కస్టమర్లను కోల్పోతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరణ వేగంగా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్