ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రసంగం దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. పార్లమెంటు చరిత్రలో అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే దక్కుతుంది. ఆమె 2020 ఫిబ్రవరి 1న 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. అయితే, పదాల సంఖ్య పరంగా చూస్తే, మాజీ ప్రధాని, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991లో చేసిన 18,650 పదాల ప్రసంగం రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. బడ్జెట్ నిడివి పెరుగుతున్న కొద్దీ పథకాలు, సంస్కరణల సంఖ్య కూడా పెరుగుతోంది.