AP: తిరుమల శ్రీవారికి మే నెలలో రికార్డు స్థాయిలో 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 18 నుంచి 23 వరకు ఆరు రోజులు ప్రతిరోజూ 50 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించగా, మే 23న ఒక్కరోజే 57,580 మంది భక్తులు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలను అందుబాటులోకి తెచ్చింది.