ఏపీ ప్రజలు తుపాన్‌తో వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.