ఏపీలోని ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

37చూసినవారు
ఏపీలోని ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. వర్షం సమయంలో చెట్లు, టవర్లు, స్తంభాల వద్ద నిల్చోవద్దని, రైతులు, పశువుల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్