నెతన్యాహు ఫోన్ కెమెరాకు రెడ్ స్టిక్కర్.. భద్రతా కారణాలా?

1058చూసినవారు
నెతన్యాహు ఫోన్ కెమెరాకు రెడ్ స్టిక్కర్.. భద్రతా కారణాలా?
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్లమెంటు పార్కింగ్‌లో ఫోన్ మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కెమెరా లెన్స్‌లకు రెడ్ కలర్ స్టిక్కర్ అంటించి ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇది సాధారణ స్టిక్కర్ కాదని, అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఫోన్ కెమెరాలకు వేసే 'ట్యాంపర్ ఎవిడెంట్ సీల్' అని వెల్లడైంది. ఈ సీల్‌ను తీయడానికి ప్రయత్నిస్తే దానిపై ముద్రలు మారి, ఫోన్ కెమెరాను ఎవరో వాడారని భద్రతా సిబ్బందికి తెలుస్తుంది. స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి రహస్య సమాచారాన్ని రికార్డ్ చేసే ప్రమాదం ఉన్నందున, ఇలా కెమెరాను కవర్ చేయడం ద్వారా హ్యాకర్లకు ఏమీ కనిపించకుండా చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్