AP: ఏపీలో రెడ్‌బుక్ పేరుతో అణచివేతలు, పౌర హక్కుల హరింపు కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టి, నియంత పాలన సాగుతోందని
వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని, సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు, ఆయనపై సెక్షన్ 111 పెట్టడం, కుప్పంలో బెయిల్ రాగానే మరో కేసు పెట్టడం ప్రభుత్వ పెద్దల కుట్ర అని విమర్శించారు. .