ఏప్రిల్ 1 నుండి హైదరాబాద్-విజయవాడ హైవేపై కొన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలు తగ్గనున్నాయి. ముఖ్యంగా 3-యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు పంతంగి టోల్ ప్లాజా వద్ద రూ.5, కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా రూ.5 చొప్పున తగ్గనుంది. కార్లు, వ్యాన్లు, జీపులు వంటి తేలికపాటి వాహనాలకు ధరల్లో మార్పు లేదు. ఈ తగ్గింపు వాహనదారులకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.