AP: రాష్ట్ర రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (VRA) ప్రభుత్వం శుభవార్త అందించింది. వీఆర్వో గ్రేడ్-2 పదోన్నతులకు డిగ్రీ తప్పనిసరి నిబంధనను సడలించింది. 2023 మార్చి 10కి ముందు నియమితులైన వీఆర్ఏలకు ఇంటర్ అర్హతతోనే పదోన్నతి కల్పించనుంది. అయితే, పదోన్నతి పొందిన ఐదేళ్లలోపు డిగ్రీ పూర్తి చేయాలి, లేదంటే తిరిగి పాత పోస్టులకు పంపనున్నారు. ఈ నిర్ణయం వల్ల రెండేళ్లుగా పదోన్నతులకు దూరమైన వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరనుంది.