అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. భూముల వేలం ద్వారా పరిహారం

2265చూసినవారు
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. భూముల వేలం ద్వారా పరిహారం
AP: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు, సంస్థకు చెందిన 6,330 ఎకరాల భూములను ప్రభుత్వం తొలి విడతలో బహిరంగ వేలం వేయనుంది. ఈ నెలలోనే వేలం విధివిధానాలు ఖరారు చేసి, సెప్టెంబర్ 15 నాటికి తొలి విడత సొమ్మును బాధితులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సుమారు 32 లక్షల మందిని మోసగించిన ఈ కేసు త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 15 నాటికి ప్రత్యేక కోర్టు భవనం సిద్ధం కానుంది. ఈ చర్యలతో అగ్రిగోల్డ్ బాధితులకు కొంత ఊరట లభించనుంది.

సంబంధిత పోస్ట్