AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డిని ఏ-39, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఏ-38గా చేర్చారు. ప్రస్తుతం భాస్కరరెడ్డి విజయవాడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.