సీఎం చంద్రబాబుపై ఆర్కే పిటిషన్లు కొట్టివేత

4989చూసినవారు
సీఎం చంద్రబాబుపై ఆర్కే పిటిషన్లు కొట్టివేత
సీఎం చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి ఆరోపణలతో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ సమర్పించిన అంశాల్లో ప్రాథమిక ఆధారాలు లోపించాయని, కేవలం ఆరోపణల ఆధారంగా కేసు విచారణను మార్చలేమని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు సీఎం చంద్రబాబుకు చట్టపరమైన ఉపశమనంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్లో ఇది ఒకటి.

సంబంధిత పోస్ట్