AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కల్తీ నెయ్యి అంశానికి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో 'కల్తీ నెయ్యి మహా పాపం నిజం', 'పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం' అంటూ ఆరోపణలు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ ఫ్లెక్సీలను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపైకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.