నటి రేణూ దేశాయ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త సినిమా ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అడ్వర్టైజింగ్ రంగంలో గుర్తింపు పొందిన యమునా కిషోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సంకర్ ఇందుచూదన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కాశీలో జరుగుతోంది. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ షూటింగ్ ఫొటోలను పంచుకుంటూ, మహాదేవుని నగరమైన కాశీలో ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పరమశివుని ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఎమోషనల్‌గా పేర్కొన్నారు. దర్శకుడు, హీరోతో కలిసి పనిచేయడం ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు.