తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

50చూసినవారు
తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక
AP: తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. 17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదికలో పేర్కొంది. 294 మండలాలలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం చూపించిందని వెల్లడించింది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, 4,794 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరింది. అలాగే తక్షణ సాయం అందించాలంది.