ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు: హైకోర్టు ఆదేశాలు

3169చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు: హైకోర్టు ఆదేశాలు
ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏలూరు జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ రేఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఆరు నెలల్లోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ ఆదేశాలతో ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు లభించేందుకు మార్గం సుగమం కానుంది.

సంబంధిత పోస్ట్