అమరావతికి చట్టబద్ధతపై నేడు అసెంబ్లీలో తీర్మానం

2చూసినవారు
అమరావతికి చట్టబద్ధతపై నేడు అసెంబ్లీలో తీర్మానం
AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీలో శనివారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఉ.11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి.. ప్రస్తుత పరిణామాలన్నింటినీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో వివరిస్తారు. అనంతరం అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు.

ట్యాగ్స్ :