మే నెలలో రిటైల్ ధరలు పెరిగాయి, వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఏప్రిల్‌లో 3.48 శాతం నుంచి 3.93 శాతానికి చేరింది. ఆహార, ఇంధన ధరల పెరుగుదల దీనికి కారణమని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. మేలో పసిడి, వెండి, టమాటో, అల్లం ధరలు పెరిగాయి. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 6.15 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. తయారీదారులకు ముడిసరుకుల ధరలు పెరగడం రిటైల్ ధరలపై ప్రభావం చూపుతోందని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త దీప్తి దేశ్‌పాండే తెలిపారు. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధిలోనే ఉంటుందని అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కే మిండా అంచనా వేశారు.