AP: గత ప్రభుత్వంలో తాను చేసిన తప్పులకు, నైతికతను విస్మరించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విడుదల చేసిన వీడియో ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. తన నిర్ణయాల వల్ల తాను విలన్ అయ్యానని ఆయన వాపోయారు. ఈ వీడియోపై అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్ర గ్రూప్-1 అధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో సూపర్ సీఎంలా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ కు పట్టిన గతి భవిష్యత్తులో తమకు ఎదురు కాదా అని విపక్షం వైసీపీ ప్రశ్నిస్తోంది.