ఏపీ లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ సిట్ ఎదుట హాజరయ్యారు. శుక్రవారం 10గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం రీత్యా రాలేనని బదులిచ్చారు. కానీ తప్పనిసరిగా హాజరుకావాలని సిట్ స్పష్టం చేయడంతో ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో లిక్కర్ విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదితర విషయాలపై సిట్ ఆయన్ను విచారిస్తోంది.