రాజధాని పనులపై ప్రతీ 2 నెలలకు ఒకసారి సమీక్ష: సీఎం చంద్రబాబు (VIDEO)

9039చూసినవారు
AP: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా "అమరావతి ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే గర్వకారణం" అని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైన సంస్థలు గర్వపడాలని, రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతతో పాటు వేగంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన సీఎం, రాజధాని నిర్మాణాల పురోగతిని ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్