AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధి సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమై 28 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. పోలీసులు విస్తృత గాలింపు చర్యలు, దర్యాప్తు చేపట్టినా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇటీవల పోలీసులు చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి కూడా ప్రకటించారు. చిన్నారి తండ్రి సుంకర గణేష్ పలు ప్రాంతాల్లో పాంప్లెట్స్ అతికిస్తూ ఆరా తీస్తున్నారు. తల్లి భవానీ పాపను తీసుకెళ్లిన వారు అప్పగించాలని వేడుకుంటున్నారు.