ప్రజలకు తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు

4చూసినవారు
ప్రజలకు తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు
AP: నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, కందిపప్పు, బియ్యం అందుబాటు ధరల్లో అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించగా, మరో రెండు కేంద్రాలు త్వరలో తెరవనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.110-120 ఉన్న కందిపప్పు రైతుబజార్లలో రూ.100కే లభిస్తుంది. అలాగే, రూ.52-60 ఉన్న బియ్యం రూ.48-49కు అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో సామాన్యులకు కాస్త ఊరట కలగనుంది.

సంబంధిత పోస్ట్