వరి గడ్డి కుళ్ళింపు పద్ధతులు

13130చూసినవారు
వరి గడ్డి కుళ్ళింపు పద్ధతులు
దేశంలో 44 మిలియన్ హెక్టార్లలో వరి సాగవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో కోటి ఎకరాలకు పైగా వరి పంట ఉంది. కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి గడ్డిని కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. దీనికి బదులుగా, వరి కోత తర్వాత పొలంలో నీరు పెట్టి, కేజ్ వీల్స్ లేదా రోటావేటర్‌తో దున్నాలి. ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 10-15 కిలోల యూరియా చల్లి, మూడు-నాలుగు రోజుల తర్వాత మళ్లీ దున్నాలి. ఈ పద్ధతి వల్ల సూక్ష్మజీవులు పెరిగి గడ్డి త్వరగా కుళ్ళి, పోషకాలు భూమిలో కలిసి తదుపరి పంటలకు ఉపయోగపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్