జుట్టు రాలడం, మెరుపు కోల్పోవడానికి ఒత్తిడి, కాలుష్యం కారణం. ఈ సమస్యను తగ్గించడానికి ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, వంటింట్లో దొరికే బియ్యం నీటితో జుట్టును మెరిసేలా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బియ్యం నీటిలో అమినో యాసిడ్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. బియ్యం నీటిలో రోజ్ వాటర్, తక్కువ గాఢత గల షాంపూ కలిపి తలకు పట్టించి 10 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు దృఢపడి, రాలడం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.