గోదావరికి పెరుగుతున్న వరద (వీడియో)

549చూసినవారు
AP: గోదావరికి వరద క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. స్పిల్‌వే అప్‌స్ట్రీమ్‌లో 30.860 మీటర్లు, డౌన్‌స్ట్రీమ్‌లో 21.726 మీటర్ల నీటిమట్టం నమోదైంది. 48 గేట్ల ద్వారా 6,40,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శని, ఆదివారాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇవాళ సాయంత్రానికి 7.50 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్