AP: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోందని, నీటిమట్టం 40 అడుగులకు చేరిందని APSDMA తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది 8-9 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. భద్రాచలం వద్ద 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.