పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

119చూసినవారు
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే
పల్నాడు జిల్లా చిలకలూరిపేట గణపవరం గ్రామ పరిధిలో 16వ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో మేడగం రామిరెడ్డి, శివరాత్రి మహేశ్, మెరుపు శ్రీకాంత్, వంగవోలు వాసు, గొడవర్తి యశ్వంత్ సాయి ఉన్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుంటూరు నుండి పల్నాడు వెళ్తున్న ప్రయాణికులే ఈ ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :