అన్ని గ్రామాలకూ రోడ్లు, తాగు నీరు: చంద్రబాబు

18చూసినవారు
అన్ని గ్రామాలకూ రోడ్లు, తాగు నీరు: చంద్రబాబు
AP: రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ 2028 డిసెంబర్ నాటికి రహదారులు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే వీబీ జీ రామ్‌జీ, కొత్తగా ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధులతోనూ గ్రామాల్లో రోడ్లు, తాగునీటి వ్యవస్థకు సంబంధించిన పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు తెలిపారు. తాగునీటి లభ్యత లేని గ్రామాలకు సమీప జలాశయాల నుంచి నీరు తీసుకునే విషయాన్ని పరిశీలించాలన్నారు.

ట్యాగ్స్ :