రామమందిర విరాళాలను దోచేసి.. స్నేహితురాలికి స్మార్ట్‌ ఫోన్‌?

14197చూసినవారు
రామమందిర విరాళాలను దోచేసి.. స్నేహితురాలికి స్మార్ట్‌ ఫోన్‌?
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఖాతా నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ డబ్బు ఆలయ విరాళాలకు సంబంధించినదేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ తన స్నేహితురాలికి సుమారు రూ.2 లక్షల నగదు, ఖరీదైన స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇచ్చినట్లు గుర్తించారు. దర్శనానికి సహాయం చేసినందుకు భక్తులు నగదు ఇచ్చేవారని మరో నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్