రాజకీయాలపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

3602చూసినవారు
రాజకీయాలపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
AP: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే  రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న వైసీపీ సర్పంచ్‌లను నగరిలోని తన నివాసంలో సన్మానించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాలు మానసిక ఒత్తిడితో కూడుకున్నవని, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత షుగర్ బారిన పడ్డానని తన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతల్లా అబద్ధాలు చెప్పలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్