రోప్ వే జంపింగ్.. సేప్టీ రోప్ కట్టకపోవడంతో యువతి మృతి (వీడియో)

29331చూసినవారు
నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. బ్రెజిల్‌ లిమేరాలోని స్కెలిటెన్ బ్రిడ్జ్ వద్ద ఎడువార్డా రోడ్రిగ్స్(21) అనే యువతి రోప్ జంపింగ్ చేస్తుండగా ఆపరేటింగ్ సిబ్బంది ఆమెకు సేఫ్టీ రోప్‌ను కట్టడం మర్చిపోయారు. 40 మీటర్ల ఎత్తు నుంచి ఆమెను కిందకు తోసేశారు. దీంతో ఒక్కసారిగా కిందపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఆరుగురు ఆపరేటింగ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు SMలో వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్