సెల్ టవర్ ఎక్కి రౌడీ షీటర్ హల్‌చల్ (వీడియో)

10997చూసినవారు
AP: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఓ రౌడీషీటర్ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. గోలి రామాంజనేయులు అనే వ్యక్తిపై గత కేసుల ఆధారంగా పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే తనను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ అతడు సెల్ టవర్‌పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్