రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 వివరాలివే

4949చూసినవారు
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 వివరాలివే
రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర ఇంకా ప్రకటించనప్పటికీ, బైక్ లుక్, బ్యాటరీ, రేంజ్ వంటి కీలక వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ బైక్ 3.91 kWh బ్యాటరీతో 154 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 15.4 kW మోటార్ తో 3.7 సెకన్లలో 0-60 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 115 km/h. ఇందులో రిమోట్ లాక్, జియో-ఫెన్సింగ్, కార్నరింగ్ ఏబీఎస్, 3-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 3.5-అంగుళాల టచ్‌స్క్రీన్, ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. దీని పనితీరు 125cc-150cc పెట్రోల్ బైక్‌తో సమానంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్