అమరావతికి రూ.1,128 కోట్లు

3చూసినవారు
అమరావతికి రూ.1,128 కోట్లు
AP: కేంద్ర వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని అమరావతికి భారీగా నిధులు కేటాయించారు. అమరావతి సమ్మిళిత, సుస్థిరత అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.1128.91 కోట్లు సమకూర్చనున్నట్టు వెల్లడించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద రూ.432.09 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320.39 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో గ్రామీణ రహదారులు, రోడ్లు-వంతెనల పునర్‌ నిర్మాణం, పట్టణ తాగు-మురుగు నీటిపారుదల, ప్రకృతి వ్యవసాయానికి కూడా కేంద్రం నిధులు ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్