పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61 కోట్లు విడుదల

7చూసినవారు
పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61 కోట్లు విడుదల
AP: కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్‌ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ నిధులు ప్రాజెక్ట్ ఖాతాలో నేరుగా జమ అవుతాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508 కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రాన్ని కోరింది. కేంద్రం సమీక్షించి ఈ నిధులను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్